తారక్ మీడియా మీటింగ్ వెనక సీక్రెట్ ఏంటి..?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేరీర్‌లో ఎప్పుడూ ఎదర్కోనన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. సినిమాల పరంగా కేరీర్ మరీ అంత స్పీడ్‌గా లేకపోవడం…అటు ఫ్యామిలీ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం లాంటి సమస్యలతో ఎన్టీఆర్ విలవిల్లాడుతున్నాడు. అయితే ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం మీడియా మిత్రులకు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ర్టీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. 15 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ మీడియాను పెద్దగా పట్టించుకోని నందమూరి వారసుడు.. ఈ మధ్యే సడన్ గా పిలిచి మరీ మీడియా మిత్రలకు పార్టీ ఇచ్చాడు. అసలు ఇంత మార్పు ఎన్టీఆర్ లో ఎలా వచ్చింది చెప్మా అంటూ మీడియా విస్తురుపోయి చూస్తుంది. కానీ దీనికి ఎన్టీఆర్ మాత్రం ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.
ఇన్నాళ్లూ తన చుట్టూ ఉన్న వాళ్లలో కొందరు తనను తప్పుదారి పట్టించారని.. వాళ్ల వల్లే మీడియాకు దూరంగా ఉంటూ వచ్చానన్నాడు ఎన్టీఆర్. ఇకపై అలాంటి పొరపాట్లు జరగవని మాటిచ్చాడు జూనియర్. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు తనతో మాట్లాడటానికి మీడియాకు ఫుల్ రైట్స్ ఇచ్చేశానన్న తారక్…తన 15 ఏళ్ల సినిమా కేరీర్‌లో 25 సినిమాలు కంప్లీట్ చేశానని…ఇప్పటి వరకు తనకు మీడియా నుంచి ఎంతో సపోర్ట్ లభించిందని..ఇకపై కూడా తనకు అలాంటి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని ఎన్టీఆర్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశాడు.
ఎన్టీఆర్ మీడియా మీటింగ్ వెనక మరో కథ కూడా వినిపిస్తుంది. సంక్రాంతికి బాబాయ్ తో అబ్బాయి పోటీ పడబోతున్నాడు. ఇందులో బాలయ్యకే కాస్త మీడియా సపోర్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కూడా. దాంతో వాళ్లను తన వైపు తిప్పుకోడానికే ఎన్టీఆర్ ఈ పార్టీ అరేంజ్ చేశాడని ఇండస్ట్రీలో వాదన వినిపిస్తుంది. ఏదేమైనా.. జూనియర్ లో వచ్చిన ఈ మార్పు ఇప్పుడు అతడి అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. అలాగే కొన్ని మీడియా సంస్థలు ఎన్టీఆర్‌తో పాటు నాన్నకు ప్రేమతో విషయంలో ప్రత్యేకంగా సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారని..ఈ విషయంలో ఎన్టీఆర్ కొంత వరకు సక్సెస్ అయినట్టేనని సమాచారం.