పరుగెత్తడం... జాగింగ్ చేయడం ద్వారా శరీరం ఫిట్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. రన్నింగ్ చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా స్మార్ట్‌ఫోనును ఛార్జ్ చేసుకునేందుకు అవసరమయ్యే విద్యుత్తునూ ఉత్పత్తి చేసుకోవచ్చని తాజాగా వెల్లడించారుఅమెరికాకు చెందిన పరిశోధకులు. ఇటీవల అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా.. పరుగెడుతూ ఫోన్లను ఛార్జింగ్ చేసుకోచవ్చట.
అమెరికాలోని విస్కాన్‌సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీర్లు.. దీనికి సంబంధించి సరికొత్త పరికరాన్ని తయారు చేశారు. బబ్లర్ పేరుతో పిలిచే ఈ పరికరాన్ని పాదరక్షలకు(షూ)అమర్చడం ద్వారా పరుగెత్తినప్పుడు వచ్చే కదలికల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా రన్నింగ్ చేస్తూ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చట.
అంతేకాదు.. ఆ విద్యుత్తును నిల్వ చేసుకుని.. కావాల్సినప్పుడు ఉపయోగించుకునే వీలుందట. ప్రస్తుతం.. ప్రయోగదశలో ఉన్న ఈ పరికరం ద్వారా ఒక్కో షూ పది వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందట. అంతేకాదు.. ఈ టెక్నాలజీ ద్వారా 10 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో రక్షణ దళాలకు ఉపయోగపడేలా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందంటున్నారు.