Alert: రూ.251 స్మార్ట్ ఫోన్ వెనుక పెద్ద స్కామ్ ఉందా?
ఈ ఫోన్ లాంచింగ్ సందర్భంగా మీడియా కు చూపించిన డెమో పీస్ వేరే కంపెనీది. రింగింగ్ బెల్స్ కంపెనీది కాదు. ADCOM అనే ఢిల్లీ బేస్డ్ కంపెనీ తయారు చేసిన ఫోన్ ని, ఆ కంపెనీ లోగో కనిపించకుండా వైట్ నర్ పూసి, మీడియా కు చూపించారు. ఇలా తమ ఫోన్ వాడుకున్నట్లు ADCOM కంపెనీకి తెలియదట. అంటే.. ఈ ADCOM చేసిన ఫోన్ ని రింగింగ్ బెల్స్ కంపెనీ అమ్ముతోంది అనుకోవడానికి కూడా వీల్లేదు.
251 రూపాయల స్మార్ట్ ఫోన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రింగింగ్ బెల్స్ అనే సంస్థ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ రోజు నుండి ఈ ఫోన్ ఆన్ లైన్ బుకింగ్స్ మొదలవుతున్నాయి. బుక్ చేసుకున్న వారికి జూన్ లోపు ఫోన్ డెలివరీ చేస్తామని ఈ కంపెనీ చెబుతోంది. అయితే, ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనేది ఒక స్కామ్ అనే అనుమానాలు వస్తున్నాయి. సాక్షాత్తూ కేంద్ర రక్షణమంత్రే మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ ఫోన్ పై డౌట్స్ ఎందుకు అంటే..
ఒక్కో సారి ఒక్కో మోడల్ చూపిస్తున్నకంపెనీ:
రింగింగ్ బెల్స్ కంపెనీ నిన్న ఉదయం చూపించిన మోడల్ కి, సాయంత్రం చూపించిన మోడల్ కి తేడా ఉంది. అంటే రెండు మోడల్స్ రిలీజ్ చేస్తున్నారా? లేక..
మీడియా కి చూపించింది వేరే కంపెనీ ఫోన్:
ఈ ఫోన్ లాంచింగ్ సందర్భంగా మీడియా కు చూపించిన డెమో పీస్ వేరే కంపెనీది. రింగింగ్ బెల్స్ కంపెనీది కాదు. ADCOM అనే ఢిల్లీ బేస్డ్ కంపెనీ తయారు చేసిన ఫోన్ ని, ఆ కంపెనీ లోగో కనిపించకుండా వైట్ నర్ పూసి, మీడియా కు చూపించారు. ఇలా తమ ఫోన్ వాడుకున్నట్లు ADCOM కంపెనీకి తెలియదట. అంటే.. ఈ ADCOM చేసిన ఫోన్ ని రింగింగ్ బెల్స్ కంపెనీ అమ్ముతోంది అనుకోవడానికి కూడా వీల్లేదు.
ఈ ధర కి ఫోన్ సాధ్యమా?
251 ధరకి స్మార్ట్ ఫోన్ సాధ్యమా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఈ కంపెనీ చెబుతున్న ఫీచర్స్ ప్రకారం ఫోన్ తయారుచేయాలంటే కనీసం 3000 అవుతుంది. ఒక సెల్‌ఫోన్లో ఉండే టచ్‌స్క్రీన్ (డిజిటైజర్), LCD వంటివి తయారు చెయ్యడానికే 2000 వరకూ ఖర్చవుతుంది. ఎంత నాసిరకం క్వాలిటీవి వాడినా కనీసం 1000 రూపాయలన్నా అవుతుంది.ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ వాళ్ళు కూడా, 2700 కన్నా తక్కువకి స్మార్ట్ ఫోన్ తయారుచేయడం సాధ్యం కాదు అని స్పష్టం చేస్తున్నారు. పోనీ కేంద్రప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇస్తోందా అంటే అదీ లేదు.
స్టాక్ ఎంతుంది?
శామ్సంగ్, ఆపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఒకసారి 50 వేల నుండి లక్ష ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తాయి. ఒక గంటో రెండు గంటలో ఆన్ లైన్ లో బుకింగ్ కి అవకాశం ఇస్తాయి. అలాంటిది, ఈ రింగింగ్ బెల్స్ కంపెనీ మాత్రం ఏకంగా మూడు రోజులు ఆన్ లైన్ లో బుకింగ్ ఓపెన్ చేసింది అంటే, ఈ కంపెనీ దగ్గర ఎంత స్టాక్ ఉండాలి. 251 రూపాయల ఫోన్ అంటే లక్షల మంది బహుశః కోట్లమంది ఆర్డర్ చేయొచ్చు, వీరందరికీ జూన్ 30 లోపు ఫోన్స్ డెలివరీ ఇవ్వాలి అంటే ఎంత పెద్ద మాన్యుక్చరింగ్ యూనిట్ ఉండాలి? ఈ కంపెనీ కి నిజంగా అంత సీనుందా? ఉంటె డెమో పీస్ వేరే కంపెనీది ఎందుకు చూపింది.
పైవన్నీ ఆలోచిస్తే..251 రూపాయల ఫోన్ అనేది స్కామ్ అనే అనిపిస్తోంది. కాబట్టి ఎందుకైనా మంచిది కాస్త ఆలోచించండి.
మేము లేవనెత్తిన సందేహాలు మీకు కూడా కరెక్టే అని అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ మోసపోకుండా ఉండడం కోసం ఈ పోస్ట్ షేర్ చేయండి.







