వెర్రిపూర్ణ వంకర వార్నింగ్ టు అన్నపూర్ణ సుంకర... ఫాన్స్
మొన్నామద్య తెలుగు సినిమా మారాలంటూ వీడియో పోస్ట్ చేసిన అన్నపూర్ణ సుంకర గుర్తుంది కదా… మరిచిపోతే కదా అంటారా. ఫేస్‌బుక్‌లో ఏ ప్రొఫైల్‌లోనైనా అన్నపూర్ణ వీడియోనే కనిపిస్తుంది. తన ఉద్దేశ్యం సరియైనదే అయినా మాట్లాడినతీరు నచ్చలేదు చాలామందికి. తెలుగు సినిమా మారాలంటూ ఒక్కొక్కరిని పేరుపేరునా ఏకేసింది. అయితే ఇటీవల యాంకర్ రవి, శ్యామలా, శ్రావణ సమీరాలు ఫేమ్ కరుణ అన్నపూర్ణ వీడియోపై స్పందించారు. సినీ రంగంనుండి కూడా కొంతమంది స్పందించారు. ఇప్పుడు కొత్తగా సినీ పరిశ్రమతో సంబందం లేని ఓ అమ్మాయి అన్నపూర్ణ సుంకర వీడియోపై స్పందించింది. తనను తాను మహితా అనీ ఈ వీడియో అన్నపూర్ణ కోసమే చేశానని చెప్పింది. అన్నపూర్ణ దెబ్బ తన ఫేస్‌బుక్ అకౌంట్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, అందరూ మిమ్మల్ని తిడుతుంటే నన్ను తిట్టినట్టే అనిపిస్తుందని తెలిపింది. జీవితం మీద విరక్తి కలుగుతుందని, మీ వీడియో పాజిటివ్‌గా ఉంటే బాగుండేది, మీరు పర్సనల్‌గా అన్నారు కాబట్టి దయచేసి సారీ చెప్పండంటూ విజ్ఞప్తి చేసింది. మీ వల్ల ఫేస్‌బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేయాల్సివస్తుంది అంటూ ముద్దుగా రిక్వెస్ట్ చేసింది. అన్నపూర్ణ వింటున్నావా……… నీ ఫ్యాన్ ఆవేదన..