Instagram posts

Find us on Facebook

Wishlist & Checkout page is available for premium users Buy Now

hero aadi daughter

hero aadi daughter
Color :
Size :
----->హీరో ఆది తండ్రయ్యాడు. 


Aadi-weds-aruna marriage picture


డైలాగ్ కింగ్ సాయికుమార్ తాతయ్యగా ప్రమోషన్ పొందాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వస్తున్న ఆది గతేడాది రాజమండ్రికి చెందిన అరుణ అనే యువతిని వివాహమాడిన విషయం తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించిన ఆది - అరుణల జంటకి పండంటి ఆడ బిడ్డ పుట్టింది. గురువారం మధ్యాహ్నం అరుణ రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి - బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదికి కూతురు జన్మించడంతో సాయికుమార్ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.త్వరలోనే ఆది గరం సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నాడు. కూతురు పుడితే అదృష్టం తలుపు తట్టినట్టే అని నమ్ముతుంటారు చాలామంది. ఆదిని కూడా కూతురు రూపంలో విజయలక్ష్మి వరించే అవకాశాలున్నాయి. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన గరంకి మంచి రిపోర్ట్సే ఉన్నాయి మరి. కథ నచ్చడంతో ఆది తండ్రి సాయికుమార్ నిర్మాతగా వ్యవహరించారు. సో గరం హిట్టయితే ఆదికి డబ్బులే డబ్బులన్నమాట.త్వరలోనే గరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆది సరసన ఆదాశర్మ నటించింది.  

Post a Comment

Message via WhatsApp

Send instant messages & product details through Whatsapp.

Money Back

If goods have problem we'll return your good.

24/7 Support

Our dedicated support is available to help you.